సూర్య నటిస్తున్న తమిళ్-తెలుగు భాషల్లో విడుదల కానున్న సినిమాలో టాలీవుడ్ సీనీయర్ హీరో విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య హీరోగా వస్తున్న ఆకాశం నీ హద్దురా సినిమాలో తెలుగు హీరో విలన్ అవతారం ఎత్తాడు. ఎయిర్ డెక్కన్ సృష్టికర్త జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తోంది.
ఈ సినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు విలన్‌గా మారబోతున్నాడు. గతంలో విలన్‌గా నటించినా… మరోసారి మోహన్‌బాబు అలరించబోతున్నాడు. అర్జున శక్తివేలుచామి పాత్రలో మోహన్‌బాబు అలరించబోతున్నాడు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అపర్ణా బాలమురళి హీరోయిన్‌గా నటిస్తోంది. హీరో సూర్య స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా మార్చి చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.