ప్రముఖ సినీ దర్శకులు వివి వినాయక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో తాడేపల్లి లోని జగన్ నివాసంలో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత జగన్ ను వినాయక్ మొదటి సారి కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో వినాయక్ భేటీ రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ లాంటి నాయకుడు దొరకటం ఏపీ ప్రజల అదృష్టం, అవకాశం వస్తే వైసీపీ నుంచి రాజమహేంద్రవరం లో ఎంపీ గా పోటీ చేస్తా అంటూ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
వివి వినాయక్ జగన్ ను మర్యాద పూర్వకంగా కలిసారా లేక ఇంకేమైనా రాజకీయకోణాలు ఉన్నాయా అంటూ గుసగుస లాడుకుంటున్నాయి రాజకీయా వర్గాలు. ప్రస్తుతం వినాయక్ సీనయ్య సినిమా లో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.