విశాఖలోని గోపాలపట్నం వద్ద ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీ ఘటనతో పలువురు మృత్యువాత పడటం పట్ల సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు సినీ ప్రముఖులు విచారణ వ్యక్తం చేస్తూ సానుభూతి తెలుపుతున్నారు. మెగా స్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, కోనవెంకట్ వంటి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విశాఖ ఘటన తమకి ఎంతో ఆవేదన కలిగించిందని.. ఈ సమయంలోనే ప్రజలు దైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.