సినీ నటుల్ని మీరు మూవీల్లోకి రాకుంటే ఏమయ్యే వారని ప్రశించగానే డాక్టర్ అని తడుముకోకుండా గతంలో జవాబులు వచ్చాయి. ప్రస్తుతం జవాబుల ట్రెండ్ మారింది. ఎవరికీ నచ్చిన అంశాన్ని వారు చెప్పేస్తున్నారు. అలాంటి ప్రశ్న టాలీవుడ్ బ్యూటీ సమంతకు వేయగానే తన మనసులోని చిరకాల కోరికను బయట పెట్టారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలన్నది సమంత కోరిక. సినిమాల్లోకి రాకుంటే అక్కడే చదువు, కెరీర్. మనకు మాంచి హీరోయిన్ మిస్ అయ్యేది. నాగచైతన్యకు మాంచి లవర్, వైఫ్ మిస్ అయ్యేది. సినిమా అవకాశం రావడంతో సమంత కోరిక నెరవేరలేదు. తన మనసులో కోరిక అలానే ఉంది. సమంత అనుకున్నట్లు సిడ్నీ స్టూడెంట్ అవుతుందా? కొంతకాలం తర్వాత స్టడీస్ చేస్తుందా? లేదా? అనేది ఫాన్స్ డౌట్.