సినిమా పరిశ్రమలో ఉన్న చాలా మంది హీరోలు చదువు విషయంలో పెద్దగా ఫోకస్ చేయరు అనే మాట మనం వింటూ ఉంటాం. సినిమాల్లో వరుస ఆఫర్లు రావడం, నటనను లైఫ్ అనుకోవడంతో చదువుని ఎక్కువగా పట్టించుకునే అవకాశం ఉండదు. ఇక మన హీరోలు ఎంత చదివారు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం.
పవన్ కళ్యాణ్; తాను ఇంటర్ చదివా అని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్; పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్… ఇంటర్ వరకు చదివి సినిమాల్లోకి వచ్చేసాడు.
ప్రభాస్; ప్రభాస్ చదువు మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. ఈ స్టార్ హీరో డిగ్రీ వరకు పూర్తి చేసాడు.
అల్లు అర్జున్: ఈ పాన్ ఇండియా హీరో చదువుని బాగానే ఫోకస్ చేసాడు. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ను పూర్తి చేసాడు.
రామ్ చరణ్; ఈ మెగా హీరో… చదువుని నెగ్లెక్ట్ చేయలేదు. లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ చేసాడు.