ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తుంది. టాలీవుడ్ లోనే నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ సంస్థను నిర్మించి ఎన్నో విజయవంతమైన సినిమాలు తెరకెక్కించారు. దిల్ సినిమాతో మొదలు పెట్టిన దిల్ రాజు ఇప్పటికే విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఇక పోతే గత కొన్నాళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటు మృతి చెందారు. అనిత మృతి తరువాత దిల్ రాజు పెళ్లి గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు. కానీ గత కొన్ని రోజులుగా దిల్ రాజు మళ్లీ పెళ్లిచేసుకుంటున్నాడని ఓ వార్త షికార్లు కొడుతుంది.
టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ ను దిల్ రాజు వివాహము చేసుకోబోతున్నాడని సమాచారం. ఆ హీరోయిన్ కూడా పెళ్లి కి ఒకే చెప్పినట్టు సమాచారం. అన్ని కుదిరితే తొందరలోనే వివాహం జరిగే అవకాశం ఉందని ఫిలింనగర్ లో మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం కొన్ని సినిమాలు చేతిలో ఉండటంతో ఆ హీరోయిన్ కూడా కొంత సమయం అడిగినట్టు తెలుస్తుంది. దిల్ రాజు ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. కాబట్టి దిల్ రాజు సన్నిహితులు కూడా పెళ్లి చేసుకోవాలని కోరటం తో ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది.