ప్రముఖ నిర్మాత దిల్ రాజు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారా…? బీజేపీ వైపు దిల్‌రాజు చూపు ఉందా…? సౌత్ సినిమా ప్రముఖులను కాదని ఆయనకు అందుకే ఆహ్వనం అందిందా…? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
దిల్ రాజు బీజేపీలో చేరటం లాంఛనమే అన్న చర్చ టాలీవుడ్‌లో జోరందుకుంది. అందుకే ఆయన బాలీవుడ్ సిని ప్రముఖులు హజరయిన మోడీతో స్పెషల్ మీటింగ్‌కు ఆహ్వనం అందిందని, ఆ కార్యక్రమంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు ఒకే చెప్పారన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి.
కొన్నాళ్లుగా దిల్ రాజు కూడా రాజకీయరంగ ప్రవేశంపై ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయన సొంతూరులో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని సమాచారం. ఆ మధ్య దిల్ రాజు కూడా రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమేనని ప్రకటించారు కూడా. దీంతో బీజేపీలోకి వెళ్తున్నారని సమాచారం అందుతోంది.
ఇటీవల మోడీతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు దిల్ రాజు. ఇప్పుడా ఫోటో వైరల్ అవుతోంది. సౌత్ సినిమా నుండి ప్రముఖులను ఎవర్నీ కూడా ఆ సమావేశానికి పిలవలేదు. దీనిపై సౌత్ స్టార్స్ ఆగ్రహంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన అయితే… తన అసంతృప్తిని ట్విట్టర్ వేదికగా మోడీని ట్యాగ్ చేసి మరీ పంచుకున్నారు. అలాంటి మీటింగ్‌కు దిల్ రాజు వెళ్లి వచ్చాడంటే ఏదో ఉండే ఉంటుంది అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు. అయితే, దీనిపై దిల్‌రాజు అధికారికంగా స్పందించాల్సి ఉంది.