గత ఐదేళ్ళలో తెలుగు సినిమా రేంజ్ మాములుగా కాదు భారీగా పెరిగిపోయింది. సినిమా బడ్జెట్ పరంగా మాత్రమే కాకుండా, బిజినెస్ పరంగా కూడా అంతేలా పెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే జాతీయస్థాయిలో నిర్మించబడే బాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గడం లేదు టాలీవుడ్. ఇప్పుడు సినీ ట్రేడ్ పండితులు చూచాయగా లెక్కలు కట్టిన ప్రకారం చూస్తే టాలీవుడ్ లోని ఇద్దరు టాప్ హీరోల రెమ్యూనరేషన్ ఫిగర్స్ ఒక్కొక్కరికీ దాదాపుగా 50 కోట్ల మార్క్ పైమాటేనట.
వీరిలో ముందు వరుసలో ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాలకు గుడ్ బై కొట్టేసి ఫుల్ టైం రాజకీయాల్లోకి వెళ్ళిపోయినా, ఇప్పటికిప్పుడు పవన్ ఓకే చెబితే ఆయనకి రెమ్యూనరేషన్ గా 55 కోట్ల వరకూ ఇవ్వడానికి హారిక హాసిని, మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక వరుసలో నెంబర్ టూ గా ఉన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. రెమ్యూనరేషన్ పరంగా చూస్తే మహేశ్ దాదాపుగా 50 కోట్ల మార్క్ లో ఉన్నాడని అంచనా. ఆ ఫిగర్ ఆల్రెడీ తనకు ముడుతోందని భోగట్టా. నిజంగా నిర్మాతలు అంత ఇస్తున్నారా అంతే, అందుకూ కారణం లేకపోలేదు. ఈ ఇద్దరి సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాలు, డిజిటల్ అండ్ శాటిలైట్ బిజినెస్ పరంగా అంత మార్కెట్ అండ్ డిమాండ్ ఉన్నాయి.
ఇక రెమ్యూనరేషన్ పరంగా ఈ ఇద్దరి తరువాత స్థానంలో ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ చేరిపోయాడు. సాహోకు గాను తనకు మొత్తం కలుపుకుంటే 40 కోట్లకు పైగానే వచ్చిందట. తన తర్వాత జూనియర్ ఎంటీయార్ అండ్ రాంచరణ్ లు దాదాపుగా 20 కోట మార్క్ రెమ్యూనరేషన్ క్లబ్ లో ఉన్నట్టుగా అంచనా. ఓ వైపు నిర్మాతలు సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నా, మరో వైపు అదే నిర్మాతల్లోని మరో వర్గం ఇంతింతగా రెమ్యూనరేషన్స్ తో బడ్జెట్ పెంచుకుంటూ పోవడం కాసింత ఆలోచించాల్సిన మేటరే!!!