కరోనా వైరస్ దెబ్బకు షూటింగ్‌లు నిలిచిపోయాయి. తారలంతా ఎవరి ఇళ్లకు వారు పరిమితం అయిపోయారు. సినిమా షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ రీ షెడ్యూల్ అవుతున్నాయి. ఈ కరోనా ఊగిసలాట ఇంకా ఎంత కాలం ఉంటుందో తెలియదు. దీంతో… దొరికిన ఈ సమయాన్ని ఓవైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే…. మరోవైపు తమ ఫ్యూచర్ ఫిల్మ్‌పై ఆలోచన చేస్తున్నారు.
ముఖ్యంగా దర్శకులంతా తమ పెన్‌కు పదును పెడుతూ… కథలను సిద్ధం చేస్తున్నారు. ఇక అగ్రహీరోల నుండి కుర్ర హీరోల వరకు కథలను వింటూ, మార్పులు-చేర్పులపై చర్చిస్తూ భవిష్యత్‌లో చేయబోయే సినిమాల స్క్రిప్ట్‌లో మునిగితేలుతున్నారు. చాలా మంది హీరోలు కథలు వినేందుకు అపాయింట్‌మెంట్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సమ్మర్‌లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాలన్నీ దాదాపు రీ షెడ్యూల్ కాబోతున్నాయి. అయితే… కొత్త డేట్స్ ఎప్పుడనేది మాత్రం కరోనా వైరస్ ప్రభావం తగ్గాక కానీ ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు సినిమాలకు పనిచేసే టెక్నికల్ టీం అంతా ఇంట్లో ఫ్యామిలీస్‌తో గడుపుతున్నారు.