సినిమా పరిశ్రమలో ఒకసారి నిలబడిన తర్వాత ఆదాయం గురించి ఆలోచించే అవసరం ఉండదు. బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా సరే సంపాదన విషయంలో హీరోలు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటారు. మన తెలుగులో పాత హీరోలు అయినా కొత్త హీరోలు అయినా సరే ఎక్కువగా వ్యాపారాల మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అలా టాలీవుడ్ హీరోల సైడ్ బిజినెస్ ఒకసారి చూస్తే…
Also Read:మష్రూమ్ వెజ్జా…? లేక నాన్ వెజ్జా…? అవి ఏ జాతికి చెందినవి…?
చిరంజీవి:
ఒకపక్క సినిమాలు చేస్తూనే సొంత నిర్మాణ సంస్థ కూడా నెలకొల్పారు. దానితో పాటుగా కేరళ బ్లాస్టర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో నాగార్జున, సచిన్ తో కలిసి ఒక ఫ్రాంచైజీ కొనుగోలు చేసారు.
నాగార్జున
అన్నపూర్ణ స్టూడియో తో పాటుగా చిరంజీవి తో కలిసి స్పోర్ట్స్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. రెస్టారెంట్ లను, కన్వెన్షన్ సెంటర్ లను నాగార్జున స్థాపించారు.
మోహన్ బాబు
సినిమా నిర్మాణ సంస్థతో పాటుగా… విద్య రంగంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టారు మోహన్ బాబు. ఇప్పుడు అవి విజయవంతంగా నడుస్తున్నాయి.
అల్లు అర్జున్
800 జుబ్లీ బార్ అండ్ పబ్ అల్లు అర్జున్ కి చెందినదే. ఈ పబ్ ని జై లవకుశ సినిమాలో కూడా చూపిస్తారు. అందులో ప్రియధర్షి పార్టీ ఇచ్చేది అక్కడే.
మహేష్
కెరీర్ మొదట్లో పెద్దగా వ్యాపారాల మీద ఫోకస్ చేయలేదు గాని ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థ అలాగే… ఏఎంబీ సినిమాస్ ని లాంచ్ చేసాడు. అలాగే గార్మెంట్స్ వ్యాపారంలో కూడా ఉన్నాడు.
సందీప్ కిషన్
చేసే సినిమాలు తక్కువే అయినా వ్యాపారంలో బాగా పెట్టుబడులు పెట్టాడు. అతని స్నేహితులు కలిసి వివాహ భోజనంబు ని ప్రారంభించగా… అది విజయవంతంగా నడుస్తుంది.
రామ్ చరణ్
సినిమాలతో పాటుగా నిర్మాతగా కూడా మారాడు. హైదరాబాద్ లో పోలో అలాగే రైడింగ్ క్లబ్ కూడా ఏర్పాటు చేసాడు. ట్రూజేట్ అనే విమానయాన సంస్థ ను కూడా కలిగి ఉన్నాడు.
రానా
వ్యాపారంలో తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్నాడు. మేనేజ్మెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు.
శర్వానంద్
జపనీస్ అలాగే అరేబియా కాఫీ రుచులతో బీన్జ్: ది అర్బన్ కాఫీ విలేజ్ అనే కేప్ ని ఏర్పాటు చేసాడు.
శశాంక్
సాయి సినిమాలో నితిన్ తో కలిసి నటించిన శశాంక్ సినిమాలు చేస్తూనే రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసాడు.
జగపతి బాబు
క్లిక్ సినీ ఆర్ట్ అనే టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్టార్ట్ చేసాడు. ఇప్పుడు సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఇలా విజయ్ దేవరకొండ, మంచు విష్ణు వంటి వాళ్ళు కూడా వ్యాపారంలో బిజీగా ఉన్నారు. నితిన్ కూడా వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెడుతూ ఉంటాడు.
Also Read: సరోగసి ద్వారా బిడ్డలను కన్న ప్రముఖులు వీరే, పెళ్లి కాకుండానే తండ్రి…!