టాలీవుడ్ లో హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉంటే వారి భార్యలు మాత్రం వ్యాపారాల మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. కొందరు సినిమాలను నిర్మిస్తే మరికొందరు వ్యాపారాల మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కొందరు హీరోల భార్యలు సీరియస్ గా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అలా చేస్తున్న ఏడుగురు హీరోలను చూద్దాం.
Also Read:ట్రోలర్స్ పై మంచు యువసేన ఫైర్
ఉపాసనా
ముందే వ్యాపార కుటుంబం న్నుంచి వచ్చిన ఉపాసనా… ఇప్పుడు అపోలో చారిటీ కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. బీ పాజిటివ్ మ్యాగజైన్ కోసం ఆమె చీఫ్ ఎడిటర్ గా ఉన్నారు. ఆమె ఏడాది సంపాదన రామ్ చరణ్ రెమ్యునరేషన్ కంటే ఎక్కువ.
నమ్రత
మహేష్ బాబుకి సంబంధించిన వ్యవహారాలూ అన్నీ ఆమెనే చూస్తుంది. యాడ్స్ ఒప్పందాలు అలాగే ఏఎంబీ మూవీస్ నిర్వహణ అలాగే బట్టల వ్యాపారం అన్నీ ఆమెనే చూస్తుంది.
స్నేహా రెడ్డి
అల్లు అర్జున్ సినిమాలతో బిజీగా ఉంటే ఆమె స్పెక్ట్రం అనే మ్యాగజైన్ విషయంలో సీరియస్ గా ఉన్నారు. దానికి ఆమె చీఫ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. తండ్రి వ్యాపారాలు కూడా చూస్తూ ఉంటారు.
అంజన
నానీ సినిమావ్యవహారాలతో పాటుగా… ఆర్క మీడియా లో కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. బాహుబలి సినిమాకు ఆమె పని చేసారు.
చిన్మయి
రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి సింగర్ గానూ… డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను పని చేస్తున్నారు. సమంతకు ఆమెనే డబ్బింగ్. చెప్తారు .
నిరూప
అల్లరి నరేష్ భార్య అయిన నిరూప… హైదరాబాద్ లో టాప్ మోస్ట్ ఈవెంట్ మేనేజర్. అనేక రకాల ఈవెంట్స్ ను మ్యానేజ్ చేస్తూ ఉంటారు.
సుమ
ఆమె యాంకర్ గా హోస్ట్ గా ఏ ఛానల్ లో అయినా సరే తానే కీలకంగా కనపడుతుంది. సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి రన్ చేస్తున్నారు.
Also Read:గంగూబాయి కతియావాడి రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు