స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా అల వైకుంఠపురములో… సినిమా నుంచి చిల్డ్రన్స్ డే కానుకగా మూడో సాంగ్ బయటకి వచ్చింది. ఓ మై గాడ్ డాడీ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోలో బన్నీ కొడుకు కూతురు కనిపించి అలరించారు. ఓ మై గాడ్ డాడీ సాంగ్ కి మెగా మూడో తరం వారసులు కలిసి చేయడం చాలా స్పెషల్ గా నిలిచింది. అల వైకుంఠపురములో ఈ ఇద్దరూ కనిపించే అవకాశం లేదు కానీ, ప్రోమో కోసమే స్పెషల్ గా ఇలా ప్లాన్ చేసినట్లు ఉన్నారు. అల్లు అయాన్, అర్హలు బన్నీపై కంప్లైంట్ చేస్తున్నట్లు డిజైన్ చేసిన ఈ సాంగ్ రిలీజ్ అయిన కాసేపట్లోనే ట్రెండింగ్ లోకి వచ్చింది. తమన్ పెప్పీ ట్యూన్ ఇవ్వగా, రోల్ రిడా, రాహుల్ సిప్లిగంజ్, బ్రేజీ, రాహుల్ నంబియార్, రాబిట్ మాక్‌లు తమ వాయిస్ తో ఈ పాటకి ఫ్రెష్ అప్పీల్ తెచ్చారు. ప్రోమోతో మెప్పించిన చిత్ర యూనిట్ ఫుల్ సాంగ్‌ను నవంబర్ 22న రిలీజ్ చేయనున్నారు.
అల్లూ వారి మూడో తరం వారసులు నాన్న కోసం పాటలో కనిపిస్తే, ఘట్టమనేని వారసురాలు సితార ఏకంగా హాలీవుడ్ సినిమాకే డబ్బింగ్ చెప్తోంది. సోషల్ మీడియాలో స్పెషల్ ఫాలోయింగ్ సెట్ చేసుకున్న సితారకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అప్పుడప్పుడూ డాన్స్ వీడియోస్ పెట్టి మహేశ్ ఫ్యాన్స్ ని సంతోష పెడుతూ ఉంటుంది. గౌతమ్ ఇప్పటికే మహేశ్ తో కలిసి వన్ నేనొక్కడినే సినిమాలో జూనియర్ మహేశ్ బాబుగా కనిపించాడు. గౌతమ్ మహేశ్ బాబులు క్లిమక్స్ లో కలిసి కనిపించే సీన్ ఘట్టమనేని అభిమానులకి ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిలో అభయ్ రామ్ కూడా నాన్న నటించే సినిమా సెట్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అభయ్ ని బుల్లి ఎన్టీఆర్ గా పిలుచుకునే నందమూరి అభిమానులు, అతని ఫోటోలు బయటకి రాగానే వాటిని ట్రెండ్ చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ చిన్న కొడుకు ఇంకా బయటకి రాలేదు. నాన్నలు స్టార్ హీరోలుగా ఆ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంటే వారి వారసులు ఇలా సోషల్ మీడియాలో స్టార్ కిడ్స్ గా పబ్లిసిటీ క్రియేట్ చేసుకుంటున్నారు.