ఇద్దరూ స్టార్ డైరెక్టర్సే. పైగా ఈ ఇద్దరి టేస్టులు వేర్వేరు. ఒకరు సెన్సిబుల్ కథను డీల్ చేయటంలో దిట్ట అయితే, మరొకరు కమర్షియల్ అంశాలను పక్కగా పట్టుకోగలరు. కానీ ఇప్పుడు వీరిద్దరి కలిసి పనిచేయబోతున్నారు.
ఇప్పుడంతా వెబ్ సిరీస్ కాలం నడుస్తోంది. పెద్ద పెద్ద నటులే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇప్పుడు దర్శకులు హరీష్ శంకర్, క్రిష్ లు కలిసి వెబ్ సిరీస్ లు డైరెక్ట్ చేయబోతున్నారు. ఇందుకోసం ఈ ఇద్దరు దర్శకులు కథను ఫైనల్ చేసే పనిలో ఉన్నారట.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో వీరితో వరుసగా సినిమాలకు కమిట్ అయ్యారు. కానీ వకిల్ సాబ్ పూర్తి చేసి… వీరికి టైం ఇచ్చే సరికి చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో వెబ్ సిరీస్ చేసి… ఓటీటీ సంస్థలకు గంగగుత్తగా ఇచ్చేసే యోచనలో ఉన్నారట.