ఈ సంక్రాంతికి సీనీ పందెం కోళ్లు సమరానికి సన్నద్ధం అయ్యాయి. మన హీరోలు మహేష్ బాబు,వెంకటేష్, నాగచైతన్య, అల్లుఅర్జున్, రజినీకాంత్ లు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మనహీరోల పక్కన ఈ ముద్దు గుమ్మలే ఇప్పుడు సంక్రాంతి రంగులకు మరింత అందాన్ని తీసుకరాబోతున్నాయి.
సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ కు జోడిగా రష్మిక మందన నటిస్తుంది. గీతగోవిందం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రష్మిక తెలుగులో మంచి స్పీడ్ లో ఉండనే చెప్పాలి. ఇప్పటికే నితిన్ తో, మరోవైపు అల్లుఅర్జున్ తో కూడా సినిమాలు చేస్తుంది.
సంక్రాంతికి మామ అల్లుళ్లు తెలుగు లోగిల్లలో అడుగుపెట్టబోతున్నారు. ‘వెంకీ మామ’తో వెంకటేష్, నాగచైతన్య నటిస్తున్న ఈ సినిమా కూడా భారీ అంచనాలతో సంక్రాంతికి సిద్ధం అవుతుంది. నాగ చైతన్య సరసన రాశికన్నా నటిస్తుండగా, వెంకటేష్ సరసన ఆర్‌ఎక్స్100 ఫెమ్ పాయల్ రాజ్‌పుత్ నటిస్తుంది.
ఇక బన్నీ కూడా అల వైకుంఠపురం సినిమాతో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. బన్నిపక్కన రెండోసారి పూజ హెగ్డే నటిస్తుంది. డీజే సినిమాతో మొదటి సారి అలరించిన ఈ జోడి మళ్ళీ జతగాకట్టారు. ఇప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న పూజ, ఇప్పటికే బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. సో ఇక్కడ కూడా ఏమేరకు తన అందాలను ఆరబోస్తుందో చూడాలి. ఇందులో ఐటెమ్ సాంగ్‌లో పూజ నటిస్తున్నారు. ఇప్పటికే పూజ తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ సంక్రాంతి బరిలో వస్తున్నారు. దర్బార్ మూవీ తో వస్తున్న రజిని సరసన నయనతార, శ్రీయ నటిస్తున్నారు. నాయన తార మెయిన్ లీడ్ చేస్తుండగా, శ్రీయ కీలక పాత్ర పోషిస్తుంది. ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ అయినప్పటికీ పోటీ ఉన్న యంగ్ హీరోయిన్లను ఏమేరకు తట్టుకుంటారో చూడాలి.
మొత్తం గా ఈ పండక్కి హీరోయిన్లు తెర మీద తమ అందచందాలతో అలరించటానికి సిద్ధంగా ఉన్నారు.