సినీ రంగంలో ప్రేమలు, పెళ్ళిళ్ళు విడాకులూ పెద్దగా టైమ్ తీసుకోవు. సినిమా ముహూర్తపు షాట్ లో కొబ్బరికాయ కొట్టినప్పుడు మొదలైన లవ్వు, అది కంప్లీట్ అయ్యి గుమ్మడికాయ కొట్టేటప్పటికి బ్రేక్ అప్ అయిపోతుంది.గ్లామర్ ఫీల్డ్ లో ఉండే స్వేచ్ఛ, ఏది చేసినా, ఎలా ఉన్నా వృత్తిపరమైన వెసులుబాటులో కొట్టుకుపోయే పరిస్థితులు ఉండడంతో ఫార్మింగులు బ్రేకింగుల వేగం మిగతా రంగాలకంటే కాస్త ఎక్కవ ఉండొచ్చు.
తొలిచూపులో ప్రేమలో పడి ఏళ్లపాటు దాంపత్యాన్ని ఎంజాయ్ చేసిన చేసిన వాళ్లూ ఉన్నారు. అలాగే ఏళ్ళకు ఏళ్ళు ప్రేమించుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకుని వారం తిరక్కుండా విడిపోయిన వాళ్ళూ ఉన్నారు. టాలీవుడ్‌లోనే టాప్ ట్రెండింగ్లో నిలిచిన కొన్ని ప్రేమలు- బ్రేకప్ ల గురించి తెలుసుకుందాం.
1.రష్మిక :
నేషనల్ క్రష్మిక అయిన రష్మిక ఇప్పుడు తెలుగుతో పాటు అటు బాలీవుడ్‌లోనూ పాపులర్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె కాల్షీట్లే ఖాళీగా ఉండడం లేదు. తన సొంత భాష అయిన కన్నడలో కిర్రాక్‌పార్టీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన రష్మిక ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఇద్దరూ పిచ్చగా ప్రేమించుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.ఆ తర్వాత కరోనా టైంలో రష్మికకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చి క్లిక్ అవ్వడం..రష్మిక పెళ్లి వాయిదా వేసుకోవడంతో వీరి బంధం ఏడు అడుగులు పడకముందే అడుగంటిపోయింది.
Also Read: పొలిటికల్ లీడర్ని ప్రేమించి పెళ్ళాడిన బాలీవుడ్ భామ స్వరా భాస్కర్…!
2. మెహరీన్ :
టాలీవుడ్‌లో మంచి సినిమాలతో ఓ ఊపు ఊపేసిన యంగ్ హీరోయిన్ మెహరీన్ హర్యానాకు చెందిన యువ రాజకీయ నాయకుడు భవ్య భిష్ణోయ్‌తో ప్రేమలో పడడం..ఎంగేజ్మెంట్ చేసుకోవడం వరకు వెళ్లింది. వీరిద్దరి ప్రేమ అప్పట్లో హైలెట్. ఎన్నో రోజుల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగి..ఫొటో షూట్లు కూడా చేసుకున్న ఈ జంట ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్నారు.
3. అక్కినేని అఖిల్:
అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్..జీవీకే ఫ్యామిలీ మనవరాలు శ్రియా భూపాల్‌ను ఘాడంగా ప్రేమించారు.అట్టహాసంగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. వీరి పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌లో జరిగిన చిన్న ఇష్యూ పెద్దది అయ్యింది. చివరకు శ్రేయా తీరుతో నాగార్జున ఫ్యామిలీ తీవ్రంగా హర్ట్ అయ్యిందన్న టాక్ వచ్చింది. చివరకు పెళ్లికి ముందే ఈ బంధం వీగిపోయింది.
4. త్రిష :
ఇద్దరు ముగ్గురు హీరోలతో ప్రేమాయణాలు నడిపిన త్రిష ఆ తర్వాత చెన్నైకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్‌తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇద్దరూ రింగులు మార్చుకున్నారు. అట్టహాసంగా పెళ్ళి చేసుకుందాం అనుకున్నారు. పెళ్ళిఅనందరం సినిమాలు మానేయాలని వరుణ్ త్రిష్‌కు కండీషన్ పెట్టడంతో పాటు రకరకాల ఆంక్షలు విధించడం త్రిష తట్టుకోలేకపోయింది. చివరకు పెళ్లిని త్రిషే క్యాన్సిల్ చేసేసుకుంది.
5. నయనతార :
నయనతార ప్రేమ – బ్రేకప్‌లు కూడా ఎప్పుడూ వార్తల్లో ట్రెండింగ్‌లో నిలిచాయి.తొలుత ఆమె యంగ్ హీరో శింబుతో ప్రేమలో పడింది. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసి ప్రభుదేవాను పెళ్లాడింది. ఆ తర్వాత విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లాడింది. ఇక మరో సీనియర్ హీరోయిన్ ఇలియానా కూడా ప్రముఖ ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమలో పడి సహజీవనం చేశాక విడిపోయింది. ఇలా టాలీవుడ్‌లో కొన్ని సెన్షేషనల్ బ్రేకప్‌లు ఎప్పుడూ హైలెట్‌గానే ఉంటాయి.
Also Read: విజయ్ ఫ్యాన్స్ ను క్షమాపనలు కోరిన సామ్!