కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలు కావాలంటారు. విలన్ల విషయంలో ఇంకాస్త ఎక్కువ ఉంటే ఫైటింగులకి స్కోపు ఉంటుంది. విలనొచ్చి హీరోని రెండు పుంజీలు కొడితేనే హీరోమీద సింపతీ పెరుగుతుంది.
హీరో జనాల సింపతీ లాగి లాగి…ఒక్కసారిగా విలన్ని లాగిపెట్టి ఒక్కటి కొడితే విలన్ ఆట కట్టు. థియేటర్లో విజిల్స్, దర్శక నిర్మాతలకు సక్సెస్సు కట్టగట్టుకుని వస్తాయన్నమాట.
అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో విలన్‌్కు విపరీతమైన డిమాండ్ పెరిగింది..! అందుకే గతంలో హీరోలుగా చేసిన వారు సైతం విలన్ రోల్స్ కు ఓకే అంటున్నారు. పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మడమంటే మాటలా..!?
విలన్లుగా రూపాంతరం చెందిన హీరోల మీద కన్సర్న్ కూడా ఆ మేరకు పెరుగుతుంది. కనుక రెమ్యునరేషన్ కూడా భారీగానే బాదే ఛాన్సు ఉంటుంది. టాలీవుడ్ లో టాప్ విలన్స్ – వారి రెమ్యునరేషన్ వివరాలను చూద్దాం!
1. ప్రకాష్ రాజ్
ఏ క్యారెక్టర్ ఇస్తే…. ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయే ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్.! అంత పురం సినిమాతో ప్రకాష్ రాజ్ విలన్ గా ఒక్కసారిగా హైలెట్ అయ్యాడు. అటు విలన్ గా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన బెస్ట్ ఇస్తూనే ఉన్నాడు. విలన్ క్యారెక్టర్ కు సినిమాకు కోటి యాభై లక్షలు తీసుకునే ప్రకాష్ రాజ్…… సపోర్టింగ్ రోల్స్ కు రోజుకు పదిలక్షల వరకు తీసుకుంటాడని టాక్!
2. సోను సూద్ :
భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా విలన్ గా సెట్ అయ్యే ఈ పశుపతి . అరుంధతి సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ నటుడు సినిమాకు 80 లక్షల నుండి కోటి వరకు తీసుకుంటున్నట్టు సమాచారం .
సంపత్ రాజ్ :
మిర్చి సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని, టాలీవుడ్ లో నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తున్న సంపత్ ఒక్కో సినిమాకు 60 లక్షల నుండి 70 లక్షల వరకు అందుకుంటునట్టు సమాచారం .
సాయి కుమార్ :
ఎవడు సినిమాలో మొదటిసారి విలన్ పాత్రలో కనిపించిన సాయి కుమార్ సినిమాకు 50 లక్షల వరకు తీసుకుంటాడ! సపోర్టింగ్ రోల్స్ కి కూడా అదే తరహాలో తీసుకుంటున్నట్టు సమాచారం.
సుదీప్ :
ఒక స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుదీప్ ఈగ సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు . దబాంగ్ 3 లో కూడా విలన్ గా చేసాడు. ఈయన రెమ్యునరేషన్ 3 కోట్లు.
ఆది పినిశెట్టి :
హీరో ఆది పినిశెట్టి సపోర్టింగ్ రోల్స్ తో పాటు విలన్ గా చేసిన సినిమాలకు దాదాపు కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ .
జగపతి బాబు :
జగ్గు భాయ్ హీరోగా కంటే విలన్ గా ఉన్నప్పుడే ఎక్కువ ఆదాయం సంపాధిస్తున్నాడు! . ఈయన సినిమాకు 2 కోట్లకుపైగా తీసుకుంటున్నట్టు సమాచారం.
హరీష్ ఉత్తమన్ :
కోలీవుడ్ లో బిజీగా కనిపించే ఈ స్టార్ …… తెలుగులో కల్కి , వినయ విధేయ రామ , సినిమాలలో విలన్ గా చేసాడు . ఈయన రెమ్యునరేషన్ 50 లక్షలు.
వివేక్ ఒబేరాయ్ :
రామ్ చరణ్ మూవీ వినేయ విధేయ రామ లో మెయిన్ విలన్ గా చేసిన వివేక్ రెమ్యునరేషన్ 3 కోట్లు.
రవి కిషన్ :
రేసుగుర్రం సినిమా నుంచి ఈ బొజ్ పూరి యాక్టర్ విలనిజం తెలుగు సినిమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది . ఇటీవల సైరా లో సైతం నటించాడు. ఈయన రెమ్యునరేషన్ 40 నుంచి 50 లక్షలు.