ప్రముఖ పీఆర్వో, నిర్మాత, స్వర్గీయ బి.ఎ.రాజు కుమారుడు… యంగ్ డైరెక్టర్ శివకుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నిజానికి శివకుమార్ పుట్టిన రోజు 22. దాంతో అతనికి ఆ సంఖ్య సెంటిమెంట్ గా మారింది.
అందుకే తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రానికి శివకుమార్ 22 అనే పేరే పెట్టారు. కాగా జనవరి 22వ తేదీన శివకుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.
2022 సంవత్సరం, జనవరి 22వ తేదీ 22 గంటలకు తన స్నేహితురాలు దండిగె లావణ్య మెడలో శివకుమార్ పెళ్లి చేసుకున్నారు.
నిరాడంబరంగా జరిగిన ఈ రిజిస్టర్ మ్యారేజ్ సమాచారాన్ని శివకుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.