కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ యంగ్ హీరో నిఖిల్ వివాహం ఎట్టకేలకు గురువారం ఉదయం ఆరు గంటల 31 నిమిషాలకు జరిగింది. నిఖిల్ ప్రేమించిన అమ్మాయితోనే పంచభూతాల సాక్షిగా పల్లవి వర్మతో ఏడడుగులు వేశాడు. షామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో జరిగిన ఈ వివాహానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మొదట ఏప్రిల్ 16న వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందిన నేపథ్యంలో వివాహం వాయిదా పడింది. ఈ వేడుకకు నేడు మూహుర్తం ఖరారయ్యింది. కరోనా కారణంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో అతి కొద్ది మంది అతిథుల మధ్య నిరాడంబరంగా హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుక జరిగింది.