టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మాస్ట్రో సినిమా సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించి ప్రమోషన్ లో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో నితిన్ మాట్లాడుతూ రీమేక్ కష్టాలను చెప్పుకొచ్చారు. అంధాదున్ సినిమా బాగా నచ్చింది. అందుకే రిస్క్ తీసుకోవాలి అనిపించింది. అలాగే మేర్లపాక గాంధీ డైరెక్టర్ గా అయితే బాగుంటుందని భావించాను.
ఈ సినిమాకు ఆయన చాలా కష్టపడ్డాడు. మార్పులు చేర్పులు చేస్తే సోల్ లేదు చెడగొట్టాడు అంటారు. కానీ దర్శకుడు మాత్రం తెలుగు ప్రేక్షకులకు అభిరుచికి తగ్గట్టు సెట్ చేశాడు. టబు పాత్రకు చాలా మందిని అనుకున్నాం. కానీ తమన్నా ఒప్పుకుంటుందా అని డౌట్ ఉండేది. అలాగే మాస్ట్రో ఓటీటీలో వస్తుందంటే చాలా బాధపడ్డానని కానీ అనుకోని పరిస్థితుల్లో ఓటీటీలోకి తీసుకురావాల్సి వస్తుంది అని అన్నారు నితిన్.