యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్…ఈ పేరు వింటే యూత్ లో మంచి ఫాలోయింగ్, కళ్ళ ముందే కదలాడే ఆరడుగుల రూపం. రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన బాహుబలి సినిమాతో ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చూపించిన నటుడు ప్రభాస్.
2002 లో ఈశ్వర్ సినిమాతో పరిచయం అయినప్పటికీ 2004 లో శోభన్ దర్శకత్వం లో వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ కేరీర్ లో ఓ టర్నింగ్ పాయింట్ గా మారింది. తరువాత ప్రభాస్ ఎక్కడ వెనక్కి చూడలేదు. అంచెలంచెలుగా తన సినిమా స్థాయిని, మార్కెట్ ని పెంచుకుంటూ యువత మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఈ రోజు యంగ్ రెబల్ స్టార్ 40 వ ఏట పుట్టినరోజు. హ్యాపీ బర్త్ డే టు ప్రభాస్..