మనిషి జీవితంలో ఇంటర్నెట్ ఓ భాగం అయిపోయింది. ఇంటర్నెట్ లేకుండా రోజు గడవడం కష్టంగా మారింది. మన రోజువారి అవసరాలకు ఇప్పుడు దీని వినియోగం పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కూడా ఇంటర్నెట్ ను గ్రామాలకు కనెక్ట్ చేస్తున్నారు. ఈ గత పదేళ్లలో దీని వాడకం గణనీయంగా పెరిగింది. 2021 మొదటి త్రైమాసికం లెక్కల ప్రకారం ఇంటర్నెట్ వాడకంలో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఈ లెక్కలు.. అత్యధిక జనాభా ఉన్న చైనా మొదటి స్థానంలో ఉందని చెబుతున్నాయి.
ఈ లెక్కలను ఒక సారి పరిశీలిస్తే.. చైనాలో 85.4 కోట్ల మంది ఇంటర్నెట్ ను వాడుతున్నారు. ఇది అగ్రదేశం అమెరికాలో ఇంటర్నెట్ యూజర్స్ తో పోల్చుకుంటే.. సుమారు మూడు రెట్లు ఉంటుంది. ఇక భారత్ జనాభాలో సుమారు సగం మంది రోజూ ఇంటర్నెట్ తో కనెక్ట్ అవుతుంటారని ఈ సర్వే చెబుతుంది. భారత్ లో 56 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న అమెరికాలో 31.3 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. అగ్రరాజ్యం సంఖ్యాపరంగా మూడో స్థానంలో ఉన్నా.. అత్యధికంగా 80శాతం మంది వాడుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 850 కోట్ల మంది జనం ఉండగా.. సుమారు 41 శాతం అంటే.. 413 కోట్ల మంది రోజూ ఇంటర్నెట్ తో కనెక్ట్ అవుతున్నట్టు ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇంకో ఆసక్తి కరమైన విషయం కూడా బయటపడింది. 26 శాతం మంది ఇంటర్నెట్ వాడకంలో ఇంగ్లీష్ భాషను ఎంచుకుంటున్నారు.
ఇంటర్నెట్ వాడకంలో టాప్ 10 దేశాలు
చైనా 85.4 కోట్లు
భారత్ 56 కోట్లు
అమెరికా 31.3 కోట్లు
ఇండోనేషియా 17.1 కోట్లు
బ్రెజిల్ 14.9 కోట్లు
నైజీరియా 12.6 కోట్లు
జపాన్ 11.8 కోట్లు
రష్యా 11.6 కోట్లు
బంగ్లాదేశ్ 9.4 కోట్లు
మెక్సికో 8.8 కోట్లు