సిల్వర్ స్క్రీన్ పై రికార్డులు సృష్టించిన సినిమాలు కూడా ఒక్కోసారి బుల్లితెరపై బోల్తా పడుతుంటాయి. దీనికి రివర్స్ లో వెండితెరపై ఫ్లాప్ అయిన సినిమాలు కూడా స్మాల్ స్క్రీన్ పై మేజిక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వెండితెరకు రిపీట్ ఆడియన్స్ ఉండరు, బుల్లితెరకు మాత్రం ఉండేది రిపీట్ ఆడియన్స్ మాత్రమే. కాబట్టి రిపీట్ వాల్యూ ఉన్న సినిమాలకు, కాస్త సెన్సిబిలిటీస్ ఉన్న సినిమాలకు బుల్లితెర వీక్షకులు బ్రహ్మరథం పడతారు.
ఈ విషయంలో వెండితెరతో పోలిస్తే.. బుల్లితెర ప్రేక్షకుల టేస్ట్ చాలా భిన్నంగా ఉంటుంది. 90శాతం సినిమాలు టీవీల్లో ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చెప్పేయొచ్చు కానీ, ఓ 10శాతం సినిమాల విషయంలో మాత్రం మన అంచనా తప్పవుతుంది. అలా బుల్లితెరపై ప్రభంజనం సృష్టించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ టాప్ మూవీస్ ఏంటే, వాటికి వచ్చిన రేటింగ్స్ (టీఆర్పీ), అవి ఏ ఛానెల్ లో ప్రసారం అయ్యాయో ఓసారి చెక్ చేద్దాం.
1. అల వైకుంఠపురములో – 29.4 (జెమినీ)
2. సరిలేరు నీకెవ్వరు – 23.4 (జెమినీ)
3. బాహుబలి 2 – 22.7 (స్టార్ మా)
4. పుష్ప – 22.54 (స్టార్ మా)
5. శ్రీమంతుడు – 22.54 (జీ తెలుగు)
5. దువ్వాడ జగన్నాధమ్ – 21.7 (జీ తెలుగు)
6. బాహుబలి – 21.54 (స్టార్ మా)
7. ఫిదా – 21.31 (స్టార్ మా)
8. గీతగోవిందం – 20.8 (జీ తెలుగు)
9. జనతా గ్యారేజ్ – 20.69 (స్టార్ మా)
10. మహానటి – 20.21 (స్టార్ మా)
Note: బార్క్ అమల్లోకి వచ్చిన తర్వాత టాప్-10 రేటింగ్స్ పొందిన సినిమాల లిస్ట్ ఇది. బార్క్ అమల్లోకి రాకముందు మంచి రేటింగ్స్ సాధించిన సినిమాలు ఈ జాబితాలో ఉండవు.