భీమ్లానాయక్ రాకతో రికార్డులన్నీ మారిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని రికార్డులు సృష్టించిన సినిమాలు వెనక్కి వెళ్లడంతో, లిస్ట్ లో నంబర్ గేమ్ మారిపోయింది. నైజాంలో మొదటి రోజు అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన భీమ్లానాయక్, ఇప్పుడు మరో రికార్డ్ నెలకొల్పింది. మొదటి వారాంతం (రిలీజైన మొదటి 3 రోజుల్లో) అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో భీమ్లానాయక్ కు చోటు దక్కింది. చోటు దక్కడం కాదు, ఏకంగా 5వ స్థానానికి వచ్చి చేరింది పవన్ కల్యాణ్ సినిమా.
విడుదలైన మొదటి 3 రోజుల్లో అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి-2 అగ్రస్ధానంతో కొనసాగుతోంది. దీని రికార్డ్ ను బీట్ చేయడం బహుశా ఆర్ఆర్ఆర్ వల్ల మాత్రమే అవుతుందేమో. ఇక రెండో స్థానంలో సాహో, మూడో స్థానంలో సైరా, నాలుగో స్థానంలో వకీల్ సాబ్ నిలవగా.. ఐదోస్థానంలో 53 కోట్ల రూపాయల షేర్ తో (3 రోజుల్లో) భీమ్లానాయక్ నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు అనుకూలంగా ఉండి ఉంటే ఈ సినిమా కచ్చితంగా రెండో స్థానానికి ఎగబాకి ఉండేదని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఆ అవకాశం దక్కకుండా పోయింది. అయితే ఈ 3 రోజుల రన్ తోనే పుష్ప, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో లాంటి సినిమాల్ని వెనక్కి నెట్టాడు భీమ్లానాయక్.
విడుదలైన మొదటి 3 రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) అత్యథిక వసూళ్లు (షేర్) సాధించిన సినిమాల జాబితా ఇలా ఉంది.
Advertisements
1. బాహుబలి 2 – రూ. 74.40 కోట్లు
2. సాహో – రూ. 58.67 కోట్లు
3. సైరా – రూ. 55.82 కోట్లు
4. వకీల్ సాబ్ – రూ. 53.37 కోట్లు
5. భీమ్లానాయక్ – రూ. 53.07 కోట్లు
6. పుష్ప – రూ. 52.98 కోట్లు
7. సరిలేరు నీకెవ్వరు – రూ. 49.30 కోట్లు
8. అల వైకుంఠపురములో – రూ. 47.39 కోట్లు
9. అరవింద సమేత – రూ. 41.80 కోట్లు
10. మహర్షి – రూ. 40.69 కోట్లు