టాలీవుడ్ లో అయినా కోలివుడ్ అయినా బాలీవుడ్ అయినా సరే ప్రకాష్ రాజ్ కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకాష్ రాజ్ కి ఒకప్పుడు వచ్చిన ఆఫర్లు ఏ నటుడికి రాలేదు. ఆయన హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయనే చెప్పాలి. ఇక ఆయన కెరీర్ లో కొందరు దర్శకులు అండగా నిలిచారు. అందులో అయిదుగురు దర్శకులు ముందు వరుసలో ఉంటారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్
ఈయన రైటర్ నుంచి దర్శకుడు అయ్యే వరకు కూడా ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ గానే ఉన్నారని చెప్పాలి. చిరునవ్వుతో, నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావ్, అతడు, జల్సా సహా మరికొన్ని సినిమాల్లో మంచి పాత్రలు ఇచ్చారు.
పూరి జగన్నాథ్
ఒకరకంగా చెప్పాలంటే ప్రకాష్ రాజ్ లోని నటుడ్ని బయటకు తీసింది ఈయనే అంటారు. విలన్ పాత్రలు సహా ఎన్నో కీలక పాత్రలు ఇచ్చారు. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, బద్రీ, ఈడియట్, టెంపర్, పోకిరి వంటి సినిమాల్లో మంచి రోల్స్ ఇచ్చారు.
వీవీ వినాయక్
ఠాగూర్, దిల్, సాంబ, అల్లుడు శీను సహా ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు ఇచ్చారు.
గుణశేఖర్
మృగరాజు, ఒక్కడు, సైనికుడు వంటి సినిమాల్లో ప్రకాష్ రాజ్ కి అవకాశం ఇచ్చారు.
కృష్ణ వంశీ
ఖడ్గం, మురారి, గోవిందుడు అందరి వాడెలే సినిమాల్లో ప్రకాష్ రాజ్ కి అవకాశాలు ఇచ్చి తీసుకున్నారు.