ఐక్యూ (IQ).. ఇంటెలిజెన్స్ కోషెంట్ (Intelligence Quotient).. ఒక మనిషికి ఉన్న తెలివితేటలు, ప్రతిభను కొలిచేందుకు ఉపయోగపడే సాధనం. IQ ఎంత ఎక్కువ ఉంటే.. అంత తెలివిమంతులని అర్థం. ఇది చిన్నారుల నుంచి పెద్దల వరకు.. అన్ని రకాల వయస్సు ఉన్నవారికి భిన్నంగా ఉంటుంది. అలాగే మానసిక వికలాంగులకు లెక్కించే ఐక్యూ భిన్నంగా ఉంటుంది. ఇక వయస్సును, మనుషులు చదివిన చదువు, వారి విజ్ఞానాన్ని బట్టి కూడా ఐక్యూను లెక్కించే విధానం మారుతుంది. ఈ క్రమంలోనే అందరికీ ఉండే ఐక్యూ ఒకేలా ఉండదు. భిన్నంగా ఉంటుంది. అయితే ప్రపంచంలో ఏ దేశానికి చెందిన ప్రజలకు IQ ఎక్కువగా ఉంటుందో తెలుసా..? అవే వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే…
ప్రపంచంలో కింద తెలిపిన టాప్ 6 దేశాల ప్రజలకు IQ ఎక్కువగా ఉంటుంది.
1. సింగపూర్
ప్రపంచంలోనే పారిశ్రామికంగా, టెక్నాలజీ పరంగా అత్యంత ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి. ప్రపంచ ఆర్థిక రంగంపై సింగపూర్ తనదైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక్కడ ప్రపంచ ఆర్థిక పరమైన కేంద్రాలు, భిన్న జాతులకు చెందిన ప్రజలు, టూరిజం ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఇక ప్రపంచంలో సింగపూర్ దేశానికి చెందిన ప్రజలకే ఎక్కువ IQ ఉంటుంది. వీరికి ఉండే గరిష్ట ఐక్యూ 108.
2. దక్షిణ కొరియా
ఈ దేశాలకు చెందిన ప్రజలకు ఉండే గరిష్ట్య IQ 106. ఆసియా దేశాల్లోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ ఇక్కడి ప్రజలు IQ విషయంలో సింగపూర్‌తో పోలిస్తే 2వ స్థానంలో ఉన్నారు. ఈ దేశానికి రాజధాని అయిన సియోల్ కూడా టెక్నాలజీ, పారిశ్రామిక రంగాల్లో ఎంతగానో అభివృద్ధి చెందింది.
3. జపాన్
జపాన్ రాజధాని టోక్యో నగరం నాణ్యమైన విద్యకు, ప్రతిభా పాటవాలు ఉన్న యువత, ఉద్యోగులకు, సరికొత్త ఆవిష్కరణలకు పెట్టింది పేరు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం టోక్యో స్మార్టెస్ట్ సిటీగా పేరుగాంచింది. అయినప్పటికీ జపాన్ ఐక్యూ విషయంలో 3వ స్థానంలో ఉంది. ఈ దేశవాసుల గరిష్ట ఐక్యూ 105.
4. ఇటలీ
యూరప్‌లో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. ఈ దేశానికి టూరిజంపైనే ఎక్కువగా ఆదాయం వస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఐక్యూ కలిగిన నాన్ ఏషియన్ కంట్రీ కూడా ఇదే కావడం విశేషం. ఈ దేశవాసుల గరిష్ట ఐక్యూ 102. ఇక్కడి రోమ్, వాటికన్ నగరాల్లో మనకు అద్భుతమైన కళా నైపుణ్యాలు దర్శనమిస్తాయి.
5. ఐస్‌ల్యాండ్
ప్రపంచంలోనే 5వ స్మార్టెస్ట్ దేశంగా ఐస్‌ల్యాండ్ పేరుగాంచింది. ఇక్కడి ప్రజలకు యుద్ధం అంటే తెలియదు. ప్రపంచ దేశాల ప్రభావం ఈ దేశంపై పడదు. ఈ దేశం ప్రశాంతతకు, సహజసిద్ధమైన వనరుల వాడకానికి పేరుగాంచింది. ఇక ఐక్యూ విషయంలో ఈ దేశంది 5వ స్థానం. ఇక్కడి ప్రజలకు ఉండే గరిష్ట ఐక్యూ 101.
6. మంగోలియా
మంగోలియా అంటే ఇప్పటికీ అదొక ప్రాంతమని దేశం కాదని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇది ఒక దేశమే. ఇది ఆసియా దేశాల్లో ఒకటి. రష్యా, చైనాలతో సరిహద్దులను పంచుకుంటుంది. ఇక 13-14వ శతాబ్దంలో జెంగిస్ ఖాన్ అనబడే ప్రముఖ చక్రవర్తి మంగోలియాను పరిపాలించాడు. మంగోలియా అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉన్న దేశం. ఐక్యూ విషయంలో ఈ దేశంది 6వ స్థానం. ఇక్కడి ప్రజలకు ఉండే గరిష్ట IQ కూడా 101 కావడం విశేషం.
ఇండియా 82 పాయింట్స్ తో దాదాపు 105 వ స్థానంలో ఉంది.