గత ఏడున్నర నెలలుగా కరోనా వైరస్ పై పోరాడుతూ… చికిత్స అందిస్తున్న డాక్టర్లకు కాస్త విశ్రాంతినిచ్చే అవకాశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. వారంతా నిత్యం పనిచేస్తూ తీవ్ర ఒత్తిడితో ఉండి ఉంటారని, వారి విషయంలో సానుకూలంగా ఆలోచించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరారు.
జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్.ఎస్ రెడ్డి, ఎం ఆర్ షాలతో కూడిన దర్మాసనం… సుమోటోగా స్వీకరించిన ఈ అంశంపై విచారణ చేపట్టింది. తీవ్ర పని ఒత్తిడి కారణంగా డాక్టర్లు మానసికంగా అలసిపోయి ఉంటారని, కరోనాపై వారు చేస్తున్న పోరాటంలో అండగా ఉండాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
ఇక గుజరాత్ ప్రభుత్వం మాస్క్ లు పెట్టుకోని వారి నుండి ఏకంగా 90కోట్ల ఫైన్ వసూలు చేయటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కోర్టు… కనీసం కోవిడ్ మార్గదర్శకాలను కూడా తయారు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది.