ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే మహానటిగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. నేనూ శైలజతో సూపర్ హిట్ అందుకున్న కీర్తి.. ఆ తర్వాత తమిళనాట కూడా హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె స్టోరీస్ సెలెక్షన్ ఇతర హీరోయిన్స్ కంటే భిన్నంగా ఉంటాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరి హీరోలతో నటించడానికి ఆమె ఎప్పుడూ రెడీనే.
సాధారణంగా టాప్ రేంజ్ కు చేరుకున్న హీరోయిన్స్ ఆ రేంజ్ హీరోలతోనే నటించాలని ఫిక్స్ అవుతారు. కానీ కీర్తి సురేష్ మాత్రం ఇందుకు భిన్నం. మిడిల్ రేంజ్ హీరోల పక్కన హీరోయిన్ గానూ నటించి మెప్పించింది. ఎన్నో సినిమాల అనుభవంతో చేయాల్సిన మహానటి సావిత్రి పాత్రను చాలా చిన్నవయసులోనే నటించింది. ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ ను కూడా అందుకుంది ఈ అమ్మడు.
ఇక హీరోయిన్ గా ఉన్నవాళ్లు చెల్లెలి పాత్రాలు అస్సలు చేయరు. కానీ కీర్తి సురేష్ అవేమి ఆలోచించకుండా నటిగా నిరూపించుకోవడానికి ఆ పాత్రలని కూడా ఒప్పుకుంటుంది. స్టార్ హీరోలకు చెల్లెలిగానూ నటిస్తోంది. ఆల్రెడీ రజనీకాంత్ చెల్లెలుగా పెద్దన్నలో నటించిన కీర్తి.. ఇప్పుడు చిరంజీవి చెల్లెలుగా భోళాశంకర్ లోనూ నటిస్తోంది.
అయితే ఇప్పుడు కీర్తి సురేష్ నిర్మాతగా మారబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే.. ప్రొడ్యూసర్ కావాలి అనుకుంటుందట కీర్తి సురేష్. ఈ విషయం తెలిసిన ఆమె సన్నిహితులు హెచ్చరిస్తున్నారట. హాయిగా సినిమాలు చేసుకోకుండా.. అలాంటి టెన్షన్ లు అవసరమా? అంటూ సలహా ఇస్తున్నారు.
ఇప్పటివరకు హీరోయిన్స్ కి చిత్ర నిర్మాణం కలిసోచ్చిన దాఖలాలు లేవు. దానికి మహానటి సావిత్రినే గొప్ప ఉదాహరణ. అలాగే జయసుధ, ఛార్మీ కౌర్ కూడా దాదాపు అదే. ఒక్క మాటతో చెప్పాలంటే ప్రొడక్షన్ దాదాపు గ్యాంబ్లింగ్ తో సమానం. ఇలాంటి ఊబిలోకి కీర్తి సురేష్ దిగాలనుకుంటుంద. అయితే ఈ విషయంపై శ్రేయాభిలాషులు, ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.