ఆర్టీసీ సమస్య రావణకాష్టంగా మండుతూనే ఉంది గత బుధవారం హైదరాబాదులోని సరూర్ నగర్ లో గుండెపోటుతో మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ నంగునూరు బాబు మృతదేహానికి అంత్యక్రియలు జరిపేది లేదంటూ కూర్చుకున్న కుటుంబ సభ్యులు ఆర్టీసీ జేఏసీ నేతలు కూర్చున్నారు. ప్రతిపక్షాల ఇచ్చిన కరీంనగర్ టౌన్ బంధు విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే వ్యాపార వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు కరీంనగర్కు తరలి వస్తున్న క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరామ్, సిపిఐ నేత గాదె వెంకటరెడ్డి, సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇతర కార్మిక నేతలు థామస్ రెడ్డి నాగిరెడ్డి ఆర్టీసీ కార్మిక సంఘాలకు చెందిన సభ్యులు భారీ ఎత్తున బాబు ఇంటి వద్దకు చేరుకున్నారు ఎంప్లాయిస్ యూనియన్ కార్యకర్తలు.. పాటలు పాడుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే దాకా పోరు తప్పదని మరో ఉద్యమం మొదలైందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » మండుతున్న కరీంనగర్.. పోరు తప్పదంటున్న నేతలు