భారీ బడ్జెట్ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలను తీస్తూ బిజీగా ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు. అయితే… సక్సెస్ కొట్టిన యంగ్ హీరోలను సైతం ఆయన వదిలిపెట్టడం లేదు. ఈ ఏడాది హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్, జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టిలతో దిల్ రాజు సినిమాలు చేయనున్నాడు.

ఇటీవలే ఈ ఇద్దరితో భేటీ అయిన దిల్ రాజు… వారికి అడ్వాన్స్ గా చెక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి వీరితో సినిమాలు చేయటానికి ఇంకా సరైన కథ, దర్శకుడు దొరకలేదు. కానీ శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో సినిమా చేయాలని ఈ అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సరైన కథ, దర్శకుడు దొరికితే… వచ్చే ఏడాది ఈ కథలు పట్టాలెక్కనున్నాయి.