టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లెక్కలు వేరుగా ఉంటాయి. సినిమా ఏదైనా తన లెక్కలు పక్కాగా వర్కవుట్ అవుతాయి. కానీ చాలా రోజుల తర్వాత దిల్ రాజు చేతులు కాల్చుకున్నాడు. ఓ చిన్న సినిమాను అంచనా వేయటంలో ఘోరంగా విఫలం అయ్యాడు.
శుక్రవారం రిలీజ్ అయినా చాలా చిన్న సినిమాల్లో షాదీ ముబారక్ ఒకటి. ఈ సినిమాను ఓ కొత్త నిర్మాత నిర్మించాడు. సినిమాపై ఇంట్రెస్ట్ తో షాదీ ముబారక్ చూసిన దిల్ రాజు… సినిమాను తీసుకున్నాడు. కొన్ని మార్పులు చేయించాడు. రీషూట్ చేయిస్తూ… ఎప్పటికప్పుడు సినిమాపై అప్డేట్ తెలుసుకున్నాడు. అంటే దిల్ రాజుకు ఈ సినిమా హిట్ కొడుతుందన్న నమ్మకం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫైనల్ కాపీ చూసి… తనే స్వయంగా మార్చి 5న రిలీజ్ అని ఫిక్స్ చేశాడు. కానీ సినిమాను ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు. శనివారం కలెక్షన్లు చూశాక… ఈ మూవీ ఫస్ట్ వీక్ పూర్తైతే గొప్ప అన్న టాక్ వినిపిస్తుంది. ట్రైలర్ ఆకట్టుకోకపోవటం, మౌత్ టాక్ బెటర్ గా లేకపోవటంతో దిల్ రాజు చేతులు కాల్చుకున్నాడన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.