కామెడీ హీరోగా ముద్రపడ్డ అల్లరి నరేష్ చాలా రోజుల తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇటీవలే విడుదలైన నాంది సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా అల్లరి నరేష్ నటనను అంతా మెచ్చుకుంటున్నారు. దీంతో తనతో సినిమా చేసేందుకు నేను రెడీ అంటూ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించారు.

మున్నార్ లో షూటింగ్ నుండి హైదరాబాద్ తిరిగొచ్చాక సినిమా చూశా. చాలా బాగుంది. అందుకే నాంది టీంను ప్రత్యేకంగా ఆహ్వానించి అభినందించాలనిపించిందన్నారు. సరైన కథతో వస్తే అల్లరి నరేష్ తో సినిమా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు దిల్ రాజు తెలిపాడు.
అల్లరి నరేష్ నటించిన నాంది సినిమా ఇటీవలే విడుదలైంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు.