ఐపీఎల్-2022, సీజన్ 15 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ తో లీగ్ దశ ముగిసింది. ఇప్పుడు టోర్నీలో మరో గట్టమైన నాకౌట్ దశ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మే 24, మే 25, మే 27 ప్లేఆఫ్ మ్యాచ్ లు జరగనున్నాయి. చివరిగా మే 29 తుది పోరు జరుగనుంది.
ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కు ప్రతి సీజన్ లో ఆరెంజ్ క్యాప్ లభిస్తోంది. ఈ క్యాప్ గెలిచిన తొలి ఆటగాడు న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్. అయితే.. ఐపీఎల్ లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన వారిలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముందున్నాడు. అయితే.. ఈ సీజన్ లో ఎవరు ఆ అవార్డును అందుకోనున్నారు అనేది ఈ వారంలో తేలిపోనుంది.
కాగా.. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో రెండు టీంలు అదనంగా పోటీలోకి వచ్చాయి. అయితే.. ఏ టీంలో ఎవరు ఎక్కువ పరుగులు సాధించారు అనేది ఆసక్తిగా మారింది. గుజరాత్ టైటాన్స్ నుండి కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అత్యధికంగా 413 పరుగులు సాధించి టీం టాప్ స్కోరర్ గా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ నుండి 629 పరుగులతో బట్లర్, లక్నో సూపర్ జయింట్స్ నుండి 537 పరుగులతో కేఎల్ రాహుల్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుండి 443 పరుగులతో డూ ప్లెసిస్ ముందున్నారు.
నాకౌంట్ నుండి వైదొలిగిన టీంలలో.. ఢిల్లీ క్యాపిటల్స్ నుండి 432 పరుగులతో డేవిడ్ వార్నర్ ముందుండగా.. పంజాబ్ కింగ్స్ నుండి 460 పరుగులతో శిఖర్ ధవన్, కోల్ కతా నైట్ రైడర్స్ టీం నుండి 410 పరుగులతో శ్రేయస్ అయ్యర్, సన్ రైజర్స్ హైదరాబాద్ నుండి 429 పరుగులతో అభిషేక్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ నుండి 368 పరుగులతో రుతురాజ్ గైక్వాడ్, ముంబై ఇండియన్స్ నుండి 418 పరుగులతో ఇషాన్ కిషన్ లు తమ తమ టీం లకు టాప్ స్కోరర్లుగా నిలిచారు.
కాగా..ఈ సీజన్ లో లీగ్ దశ ముగియడంతో ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ పోటీలో ముందుంది ఎవరో ఐపీఎల్ మేనేజ్ మెంట్ ప్రకటించింది. ఆరెంజ్ క్యాప్ కు జోస్ బట్లర్ 623 పరుగులతో అగ్రస్థానంలో నిలవగా.. మరోవైపు పర్పుల్ క్యాప్ రేసులో 26 వికెట్లు సాధించి యుజ్వేంద్ర చాహల్ ముందున్నాడు. అయితే.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ రేసులో అగ్రస్థానంలో ఉన్న వారిద్దరూ ఒకే జట్టు (రాజస్థాన్ రాయల్స్) కు చెందిన వారు కావడం విశేషం. అయితే.. లీగ్ ముగిసే సమయానికి అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన వారికి ఈ క్యాప్స్ లభిస్తాయి.