సినిమాల్లో హీరోలు, హీరోయిన్ ల లుక్స్ ఎలా ఉంటాయి అనేది సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది అనే మాట వాస్తవం. సినిమాలో హీరోని లేదా హీరోయిన్ ని భిన్నంగా చూపిస్తే ఆ సినిమా ఫలితం కూడా భిన్నంగానే ఉంటుంది. ఇక సినిమాలో హీరో హీరోయిన్ లను మనకు నచ్చిన విధంగా చూపించడానికి తీవ్రంగా కష్టపడే వారు స్టైలిస్టులు… ఇక హీరోయిన్ లను అందంగా చూపించే స్టైలిస్టు లు ఎవరో చూద్దాం.
Also Read:అప్పులపై కేసీఆర్ వివరణ… మరోసారి కేంద్రంపై సీరియస్..!
నీరజ కోన: సమంతా, లక్ష్మీ మంచు, రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి, రీతు వర్మ వంటి వారికి ఆమె పర్సనల్ స్టైలిస్టుగా ఉన్నారు. గుండె జారి గల్లంతయ్యిందే, నిన్ను కోరి, అత్తారింటికి దారేది సినిమాలో సమంతా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సహా పలు సినిమాలకు ఆమె పని చేసారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా ఆమె సేవలు అందిస్తున్నారు.
అశ్విన్ మావ్లే: జూనియర్ ఎన్టీఆర్, నితిన్, అల్లు అర్జున్, ఇలా చాలా మంది స్టార్ హీరోలకు ఆయన స్టైలిస్టుగా పని చేస్తున్నారు. అదే విధంగా తొలి ప్రేమ, పడి పడి లేచే మనసు తో వంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పని చేసారు.
గీతిక చడ్డా: రకుల్ ప్రీత్ సింగ్, రానా వంటి వారికి పర్సనల్ స్టైలిస్టుగా పని చేస్తున్నారు. మహేష్ బాబు సతీమణి నమ్రతకు కూడా ఆమె పని చేస్తున్నారు.
నితీశా శ్రీరాం: రాశి ఖన్నాతో మరికొందరు హీరోయిన్లకు ఆమె పని చేస్తున్నారు.
హర్మాన్ కౌర్ ; విజయ్ దేవరకొండ లుక్స్ వెనుక ఈమెనే ఎక్కువగా ఉంటారు.
ప్రీతం జుకాల్కర్; ఈమె సమంత తో పాటుగా… నిహారిక, లావణ్య వంటి హీరోయిన్ లకు పని చేస్తున్నారు.
పల్లవి సింగ్: మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి నాగార్జున కు స్టైలిస్టుగా పని చేసారు. అలాగే అఆ జనతా గ్యారేజ్, అదిరింది సినిమాల్లో సమంతకు పని చేసారు. సంగీత దర్శకుడు అనిరుద్ కి కూడా ఆమె చేసారు. సర్కార్ సినిమాలో విజయ్ కు కూడా వర్క్ చేసారు.
అర్చా మెహతా: కాజల్ కు ఆమె పని చేసారు. అలాగే క్యాథరిన్, రాశీ ఖన్నా కు కూడా ఆమె పని చేసారు.
శ్రావ్య వర్మ: విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ సహా రష్మిక మంధన వంటి వారికి పని చేసారు.
అక్షయ్ త్యాగి: మహేష్ బాబుకి వ్యక్తిగత స్టైలిస్టుగా పని చేస్తున్నారు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుకి కాస్ట్యూమ్ కూడా ఆయనే చూసుకున్నారు.
Advertisements
Also Read:ప్లాన్ ప్రకారమే సస్పెన్షన్.. 17న బీజేపీ ఎమ్మెల్యేల దీక్ష..!