జనరేషన్ మారేకొద్దీ ప్రేమవివాహాలు పెరుగుతున్నాయి. ప్రాంతం, భాష, కులం, మతం ఇలా దేనితో సంబంధం లేకుండా చాలామంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో సైతం ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మన టాలీవుడ్ హీరోస్ కూడా చాలామంది వేరే రాష్ట్రాలకు చెందిన వారిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
అందులో మొదటగా అక్కినేని నాగార్జున….1992లో అమలను నాగార్జున ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి 1987లో కిరాయి దాదా సినిమా చేశారు. ఈ సినిమాతో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. అలాగే అమల తండ్రి బెంగాలీ కి చెందినవాడు కాగా తల్లి ఐర్లాండ్ కు చెందిన మహిళ.
మరో హీరో పవన్ కళ్యాణ్… 2000 సంవత్సరంలో వచ్చిన బద్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రేణుదేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పవన్. 2009లో వీరి పెళ్లి జరిగింది ఇక ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంది. వీరికి అకీరా, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ బాబు కూడా నమ్రత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2000 సంవత్సరంలో విడుదలైన వంశీ సినిమా తో ఈ ఇద్దరికి పరిచయం అయింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరికి ఇష్టం కలిగింది. అది ప్రేమగా మారింది. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. వీరికి గౌతమ్,సితార ఇద్దరు పిల్లలు.
అలాగే 2010లో నాగచైతన్య సమంత కలిసి ఏం మాయ చేసావే సినిమాలో నటించారు. ఈ సినిమా నాగ చైతన్య కు రెండవ చిత్రం కాగా సమంత కు మొదటి చిత్రం. ఈ సినిమాతో ఈ ఇద్దరి ప్రేమ చిగురించింది. దీంతో 2017 లో వీరు వివాహం చేసుకున్నారు. ఇక సమంత తల్లి మలయాళీ కాగా తండ్రి తెలుగువాడు. వీరి కుటుంబం మాత్రం చెన్నైలో సెటిల్ అయింది. వీరిలో పవన్- రేణు, సమంత- నాగచైతన్య విడాకులు తీసుకోగా మిగిలిన వారు ఫ్యామిలీ తో కలిసి ఉన్నారు.