ప్రతి సినిమాకి హీరోతో పాటు విలన్ ఉంటాడు. విలన్ క్యారెక్టర్ లేనిదే 90% సినిమా లు ఉండవు. హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలంటే విలన్ క్యారెక్టర్ ఉండాల్సిందే. అయితే సినిమాలలో ఎంతో భయంకరంగా కనిపించే విలన్స్ నిజ జీవితంలో మాత్రం చాలా సాధారణం గా కనిపిస్తారు. అలాగే ఈ విలన్స్ కు అందమైన భార్యలు కూడా ఉన్నారు. ఇప్పుడు వారెవరో తెలుసుకుందాం.
రఘువరన్… రఘువరన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషా, ఒకే ఒక్కడు వంటి చిత్రాలలో నటించి ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే రియల్ లైఫ్ లో రఘువరన్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె మరెవరో కాదు, అప్పటి హీరోయిన్ ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోహిణి. 1994 లో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో 2004 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2008లో రఘువరన్ గుండెపోటుతో మృతి చెందాడు.
ప్రకాష్ రాజ్…ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. వందల పాత్రలో నటించచాడు ప్రకాష్ రాజ్. కాగా 1994 లో లలిత్ కుమారిని వివాహం చేసుకున్నారు ప్రకాష్ రాజ్. 2009లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2010లో పొన్ని వర్మ ను వివాహం చేసుకున్నారు.
మురళీ శర్మ… తెలుగు లో విలన్ పాత్ర లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్నాడు. 2009లో నటి అశ్విని కల్సేకర్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె కూడా నెగిటివ్ రోల్స్ చేస్తుండటం విశేషం. బద్రీనాథ్, నిప్పు, రక్త చరిత్ర వంటి సినిమాల్లో ఆమె నటించారు.
అజయ్… రాజమౌళి విక్రమార్కుడు సినిమాలో నటించిన ఈయన ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించారు. ఈయన శ్వేత రావురిని 2007లో వివాహం చేసుకోగా 2017 లో మిస్ ఇండియా, 2017 లో మిస్ వరల్డ్ ఫైనలిస్ట్ గా నిలిచింది.
ఆశుతోష్ రాణా.. శ్రీను వైట్ల రవితేజ కాంబినేషన్ లో వచ్చిన వెంకీ చిత్రంలో పోలీస్ గా నటించిన ఈయన ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమా లో కూడా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈయన రేణుక సహానేను వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు. రాహుల్ దేవ్… టక్కరి దొంగ సినిమా తో విలన్ గా పరిచయం అయిన ఈయన సింహాద్రి మాస్ వంటి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1998లో రీనా ను వివాహం చేసుకున్నారు. కానీ 2009 క్యాన్సర్ తో ఆమె మృతి చెందారు.
Advertisements
ఆఖరిగా కాలకేయ ప్రభాకర్….ఈయన కూడా ఎన్నో సినిమాలలో నటించారు. అయితే రాజమౌళి బాహుబలి సినిమా తో ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఈయన విలన్ రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు.