భీమ్లానాయక్ రికార్డుల మోత మొదలైంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా తొలి రికార్డ్ ఓవర్సీస్ లో నమోదైంది. ప్రీమియర్స్ తో అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలోకి భీమ్లానాయక్ చేరింది. ఓవైపు కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుతున్న వేళ.. థియేటర్లకు రావాలా వద్దా అని ఆడియన్స్ జంకుతున్న నేపథ్యంలో భీమ్లానాయక్ కు రికార్డ్ ఓపెనింగ్స్ రావడం విశేషం.
యూఎస్ఏలో ప్రీమియర్స్ తో 8 లక్షల 58వేల డాలర్లు ఆర్జించింది భీమ్లానాయక్. అంటే, ఈ స్టోరీ మీరు చదివే టైమ్ కు ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిపోయినట్టే. అంతలా తొలి రోజు ప్రేక్షకుల్ని ఆకర్షించింది పవన్ కల్యాణ్ సినిమా. ఏకంగా లిస్ట్ లో 7వ స్థానానికి చేరుకోవడం విశేషం.
ప్రీమియర్స్ లో ఆల్ టైమ్ నంబర్ వన్ బాహుబలి-2. ఆ తర్వాత స్థానం పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాదే. మూడో స్థానంలో బాహుబలి-1, నాలుగో స్థానంలో ఖైదీ నంబర్-150 నిలిచాయి. ఈ లిస్ట్ లో భీమ్లానాయక్ కు ఏడో స్థానం దక్కింది. ఈ సినిమా రాకతో సైరా, భరత్ అనే నేను, అల వైకుంఠపురములో సినిమాలు కాస్త వెనక్కి వెళ్లాయి. ఇక యూఎస్ఏలో ప్రీమియర్స్ తో అత్యథిక వసూళ్లు సాధించిన టాప్-10 సినిమాల లిస్ట్ ఇలా ఉంది.
బాహుబలి 2 – 4,517,704 డాలర్లు
అజ్ఞాతవాసి – 1,521,438 డాలర్లు
బాహుబలి – 1,364,416 డాలర్లు
ఖైదీ నంబర్ 150 – 1,295,613 డాలర్లు
స్పైడర్ – 1,005,630 డాలర్లు
సాహో – 9,15,224 డాలర్లు
భీమ్లానాయక్ – 8,58,000 డాలర్లు
సైరా – 8,57,765 డాలర్లు
భరత్ అనే నేను – 8,50,000 డాలర్లు
అల వైకుంఠపురములో – 8,09,072 డాలర్లు