తాబేలు శాకాహారి అని మనకు తెలుసు. కానీ.. మొట్టమొదటి సారి ఒక భారీ తాబేలు పక్షిని తింటూ కెమెరాకు చిక్కింది. ఫ్రెగెట్ ద్వీపంలో జరిగిన ఈ ఘటనపై కేంబ్రిడ్జ్ పరిశోధకులు నివ్వెరపోయారు.
శాఖాహార జాతికి చెందిన ఈ తాబేలు మాంసాహారిగా మారిందా అని ఆశ్చర్యపోయారు పరిశోధకులు. ఆ పక్షిని వేటాడిన విధానం చూసి… ఇంతకుముందుకు కూడా చిన్నచిన్నవాటిని వేటాడి తినే ఉంటుందని అనుమానిస్తున్నారు. పక్షుల గూళ్ల నుంచి పడే గుడ్లు, చేపలను తిని మాంసాహారానికి అలవాటు పడి ఉండొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.