వరుసగా మూడవరోజు పదివేలకుపైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 62,912 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేయగా 10,820 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక మరో వైపు 97 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య 227860కి చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 138712 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87112 యాక్టివ్ కేసులు ఉండగా మృతిచెందినవారి సంఖ్య 2036కు చేరింది. ఇక గత 24 గంటల్లో గుంటూరులో 12, అనంతపురంలో ఎనిమిది మంది చనిపోగా, కర్నూల్ లో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో పది మంది, చిత్తూరులో పది మంది, నెల్లూరులో నలుగురు, ప్రకాశంలో పదకొండు, శ్రీకాకుళం ఎనిమిది మంది, తూర్పుగోదావరిలో ఆరుగురు చనిపోగా విశాఖపట్నంలో ఆరుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మరణించారు.