బాణాసంచా అమ్మకం, కాల్చడంపై కొనసాగుతున్న నిషేధాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నిషేధాన్ని మరి కొంత కాలం పొడిగించింది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఢిల్లీ, పరిసర ప్రాంతాలు) తోపాటు, దేశంలో వాయు నాణ్యత అధ్వాన్నంగా, సాధారణం కంటే తక్కువ ఉన్న అన్ని నగరాలు, పట్టణాలకు ఈ నిషేధం వర్తిస్తుందని NGT స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్న క్రమంలో దేశంలోని కాలుష్య ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండటం కోసం తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది.
మరోవైపు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు కొంత మినహాయింపు ఇచ్చింది. రాత్రి 11:55 గంటల నుంచి ఉదయం 12:30 గంటల వరకు 35 నిమిషాలపాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని సూచించింది. తమ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా మెజిస్ట్రేట్‌లదేనని స్పష్టంచేసింది. ఎవరైనా క్రాకర్స్ అమ్మినా, కాల్చినా నష్ట పరిహారం వసూలు చేయాలని సూచించింది. ఈ మేరకు NGT ఒక ప్రకటన విడుదల చేసింది.