దేశంలో కరోనా వైరస్ ఉధృతి నిలకడగానే కొనసాగుతోంది. చాలా రోజులుగా రోజూవారీ కేసులు 40 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 36 వేల 595 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 95.71 లక్షలకు చేరింది. ఇక కరోనా కారణంగా నిన్న 540 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక ఇప్పటివరకు మొత్తం 90.16 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4.16 లక్షలుగా ఉంది. ఇప్పటి వరకు ఈ మహమ్మారికి 1,39,188 మంది బలయ్యారు. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 6.5 కోట్ల మార్కును దాటేసింది. ఇప్పటివరకు 15 లక్షలకు పైగా మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.