ఏపీలో మరోసారి 24 గంటల్లో పదివేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మార్కు దాటిపోయింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 62,938 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేయగా 10,171 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఒకే రోజు 89 మంది మృతి మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,04,065కి చేరుకోగా.. ఇప్పటివరకు కరోనాబారినపడిన 1,17,569 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 84,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 1,842 మంది మృతిచెందారు.
గడిచిన 24 గంటల్లో మృతి చెందిన వారిలో చిత్తూరులో 10 మంది మృతిచెందగా.. అనంతపురం, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది మంది చొప్పున, తూర్పుగోదావరి, కడప, ప్రకాశం జిల్లాలో ఏడుగురు చొప్పున, కృష్ణా జిల్లాలో ఆరుగురు, కర్నూల్, విశాఖపట్నం జిల్లాలో ఐదుగురు చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ముగ్గురు చొప్పున మృతిచెందారు.