శ్రీకాకుళం జిల్లాలో నెలివాడ జంక్షన్ వద్ద టూరిస్ట్ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ప్రయివేట్ బస్సును టూరిస్ట్ బస్సు ఢీకొని సినీ ఫక్కీలో అవతలివైపుకు దూసుకెళ్లి లారీని బలంగా ఢీకొట్టింది. లారీ అమ్మోనియం లోడుతో ఉండటంతో క్షణాల్లో మంటలు దావానంలా వ్యాపించాయి. టూరిస్ట్ బస్సు మంటలకు పూర్తిగా దగ్దమైంది. అయితే ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అవ్వగా.. ప్రాణాపాయం తప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు రణస్థలం అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి వైజాగ్ వెళ్తుండగా నెలివాడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తుంది.