ఒడిశాలోని సత్పాద వద్ద కొంత మంది ప్రయాణికులు చిల్కా సరస్సులో చిక్కుకుపోయారు. మెరైన్ లాగూన్ లోని ఓ దీవిలో పానా యాత్రకు వెళ్లిన తమకు ఈ చేదు అనుభవం ఎదురైందని అంటున్నారు పర్యటకులు.
పడవలు నడుపుకునే రెండు వర్గాల వారి మధ్య ఏర్పడిన వివాదంతో 30కి పైగా పడవలు సరస్సులోనే ఇరుక్కుపోయారు. కొన్ని గంటలపాటు నిరీక్షణ అనంతరం వివాదం సద్దుమణగడంతో సురక్షితంగా బయటికి పడ్డామంటున్నారు ప్రయాణికులు.
అనంతరం జంహికుడ నుంచి సత్పాదకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే.. అంతకుముందు సత్పాద నుంచి వెళ్లిన ప్రయాణికులను జంహికుడ వద్ద దిగడానికి పడవల యజమానులు అనుమతించలేదు.
దీనిపై కోపంతో పడవల నిర్వాహకులు అక్కడి బోట్లను నిరాకరించారు. దీంతో వారు కొన్ని గంటల పాటు సరస్సులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు ప్రయాణికులు.