హిమాచల్‌ప్రదేశ్ లో రోప్ వే ఎక్కిన పర్యాటకులు కొన్ని గంటల పాటు నరకం చూశారు. టింబర్ ట్రెయిల్ రోప్ వేలో సాంకేతిక సమస్య కారణంగా కేబుల్ కార్ మధ్యలోనే నిలిచి పోయింది.
దీంతో కేబుల్ కార్ లోని 11 మంది ప్రయాణీకులు గాల్లోనే చిక్కుకుని పోయారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఇప్పటి వరకు ఐదుగురిని సురక్షితంగా కాపాడినట్టు అధికారులు వెల్లడించారు. ఇంకా ఆరుగురు కేబుల్ కారులోనే చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు.
వారిలో ఇద్దరు వృద్ధులు, మరో నలుగురు మహిళలు ఉన్నట్టు వివరించారు. వారిని రక్షించేందుకు విపత్తు నిర్వహణ దళాలను రంగంలోకి దించినట్టు అధికారులు పేర్కొన్నారు.