ఆకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. నీళ్లపాలు కావడంతో వారి కంట కన్నీళ్లు ఆగడం లేదు. దీనికి కారణం ఎవరు.. అకాల వర్షమా? కొనుగోళ్ల జాప్యమా? ప్రభుత్వ వైఫల్యమా? అని ప్రశ్నిస్తే.. ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడుతున్నారు అన్నదాతలు. ప్రభుత్వం అన్ని రకాల మౌళిక వసతులు కల్పించి ఉంటే కల్లాల్లో ఉన్న పంట నీళ్లపాలు ఎందుకవుతుందని ప్రశ్నిస్తున్నారు.
రైతుల కష్టం నీళ్లపాలు కావడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. అకాల వర్షానికి చేతికొచ్చిన పంట కొట్టుకుపోవడంతో రైతులు బాధతో విలపిస్తున్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ పాలనపై విమర్శలు చేశారు రేవంత్.
రేవంత్ రెడ్డి ట్వీట్
‘‘కేసీఆర్ దరిద్రపు పాలనలో రైతుల దయనీయ స్థితి ఇది. రైతు కష్టం క‘న్నీటి’ పాలవుతుంటే అయ్యా కొడుకులు ప్లీనరీలు.. ఫాంహౌస్ లో గ్రీనరీల మధ్య సేద తీరుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల డ్రామాతో కాలయాపన చేసిన బీజేపీ – టీఆర్ఎస్ ప్రభుత్వాలే ఈ నష్టానికి బాధ్యత వహించాలి’’
అకాల వర్షం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంట తడిసిపోయింది. ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇటు అకాల వర్షంపై మంత్రి గంగుల కమలాకర్ ఆరా తీశారు. కలెక్టర్లు, అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్ దరిద్రపు పాలనలో రైతుల దయనీయ స్థితి ఇది.
రైతు కష్టం క’న్నీటి’ పాలవుతుంటే అయ్యా కొడుకులు ప్లీనరీలు…ఫాంహౌస్ లో గ్రీనరీల మధ్య సేద తీరుతున్నారు.
ధాన్యం కొనుగోళ్ల డ్రామాతో కాలయాపన చేసిన బీజేపీ – టీఆర్ఎస్ ప్రభుత్వాలే ఈ నష్టానికి బాధ్యతవహించాలి.#AntiFarmerTRS pic.twitter.com/yhG2LrTkcL
— Revanth Reddy (@revanth_anumula) May 4, 2022
Advertisements