టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ‘హాత్ సే హాత్ జోడో’ పాదయాత్ర ప్రారంభమైంది. సోమవారం మేడారం నుంచి రేవంత్ పాదయాత్ర మొదలు పెట్టారు. మేడారంలో సమ్మక్క – సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లిన రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. రేవంత్ రాక సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా పేల్చి, డోలువాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో నిలువెత్తు బంగారాన్ని రేవంత్ తులాభారం వేశారు. సమక్క – సారలమ్మ దర్శనానంతరం టీపీసీసీ చీఫ్ యాత్రను మొదలుపెట్టారు. ఈ యాత్రలో ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘నా ప్రజాప్రస్థానంలో “యాత్ర” కీలక ఘట్టం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టాను. ప్రజల ఆశీర్వాదంతో నాయకుడుగా ఎదిగాను. ప్రశ్నించే గొంతుకగా వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను. నన్ను నాయకుడ్ని చేసిన ప్రజల కోసం.. వారి జీవితాల్లో మార్పు కోసం..“యాత్ర” గా వస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ నీకు ఘన వీడ్కోలు చెబుతూ..
గుండెల నిండా అభిమానంతో నినదిస్తోంది.
సాగిపో సారథి…
నిర్విఘ్నంగా..లక్ష్యం చేరేదాకా…With heart full of admiration…
We say goodbye from Telangana…
Go ahead @RahulGandhi ji
Uninterrupted … until the goal is reached.#ManaTelanganaManaRahul pic.twitter.com/L5dqjb7qP0— Revanth Reddy (@revanth_anumula) November 8, 2022
కాగా కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఎంతో బ్రహ్మాండంగా పాదయాత్ర సాగుతుందని వారు తెలిపారు. పాదయాత్రతో ఆట మొదలైందన్నారు. పాదయాత్రను ప్రజల యాత్రగా మారుస్తామని.. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని కాంగ్రెస్ కార్యకర్తలు తెలిపారు. ‘భారత్ జోడో యాత్ర’కు పొడిగింపుగా రేవంత్ ‘హాత్ సే హాత్ జోడో’ కొనసాగుతుందని చెప్పారు.
ఈ నెల 22 వరకు తొలి విడుత పాదయాత్ర జరగనుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేర్వేరు నియోజకవర్గాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరవేయాలని ఏఐసీసీ నిర్దేశం మేరకు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని ఎమ్మెల్యే సీతక్క ఆదివారం తెలిపారు.