టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘హాథ్ సే హాథ్’ జోడో యాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. యాత్రలో భాగంగా బుధవారం రేవంత్ రెడ్డి నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వరాలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు.. రేవంత్ కి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాను అభివృద్ధి పథంలో ఉంచుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం నిజామాబాద్ జిల్లా టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు రేవంత్ రెడ్డిని కలిశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ఎప్పడూ ముందుంటుందని స్పష్టం చేశారు. కార్మికులకు ఎలాంటి సమస్యలున్నా.. కాంగ్రెస్ వారిని ఆదుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏడ్ల నాగరాజు, పుదరి గంగాధర్, వేణు, గోపాల్, పెంటా చారీ, జాక్రియ, కార్తిక్, మొహియుద్దీన్, శ్రీనివాస్, భుమేష్, అసిష్, నాంపల్లి మోహన్ పలువురు టీఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు.