పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతుల హత్య కచ్చితంగా టీఆర్ఎస్ చేసిన పనే అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఈ హత్యలను కనీసం ఖండించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాలని ప్రశ్నించారు. హోంమంత్రి పూర్తిగా డమ్మీగా మారిపోయారని మండిపడ్డారు.పోలీసులు కూడా పింక్ షర్ట్ వేసుకున్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
శీలం రంగయ్య లాకప్ డెత్‌పై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్న ఈ దంపతులు… తమకు ప్రాణహాని ఉందని కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. పుట్టా మధు అక్రమాలపై కూడా కోర్టులో లాయర్ దంపతులు కేసులు వేశారని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం పోయిందని ఉత్తమ్ అన్నారు. ఈ హత్యలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామని చెప్పారు.