తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం జరిగే పోతిరెడ్డిపాడు విస్తరణ జరిగితే కెసిఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు . నీ అసమర్థత , నిర్లక్ష్యం వల్ల తెలంగాణకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు ఉత్తమ్ . కెసిఆర్ , జగన్ కలిసి ఆడుతున్న నాటకమని మండిపడ్డారు .
కెసిఆర్ మీడియా ముందుకు ఇంకా ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు . ఆనాడే ప్రాజెక్ట్ విస్తరణను కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు . కెసిఆర్ మనసులో ఏముందో బయటకొచ్చి చెప్పాలన్నారు . ఎవడి అబ్బ సొమ్మని పాలమూరు రంగారెడ్డి కెపాసిటీ ని రెండు టీఎంసీ ల నుండి ఒక టీఎంసీ కి తగ్గించావని ప్రశ్నించారు .