సీఎం కేసీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నారని.. ధాన్యం కొనుగోళ్లపై దమ్ముంటే నాతో రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రావాలని పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పాస్ పోర్ట్స్ బ్రోకర్లు ఎవరో ప్రజలు మర్చిపోలేదని, అసెంబ్లీ సాక్షిగా పారాసిటమాల్ తో కరోనా పోతుందని ఎవరు చెప్పారని ప్రశ్నించారు.
మార్చి నెలలో కాంట్రాక్టర్లకు నిధులు ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగులు-పెన్షనర్లకు జీతాలివ్వలేదని… తెలంగాణలో ఆంధ్రా కాంట్రాక్టర్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకొని ప్రైవేటు విమానాల్లో తిరుతున్నారని ఆరోపించారు.
తెలంగాణలో కేసులు, డెత్ రేటు గురించి మాట్లాడిన సీఎం… టెస్టుల గురించి ఎందుకు మాట్లాడలేదన్న ఉత్తమ్, కేసీఆర్ తన జీవితకాలంలో ఇచ్చిన ఏమాటను కూడా నిలబెట్టుకోలేదన్నారు. కేసీఆర్ కు వైన్ షాప్స్ పై ఎందుకంత ప్రత్యేకమైన ప్రేమ, గవర్నర్ కు మేము ఇచ్చిన లేఖ తెప్పించుకొని చదవాలన్నారు ఉత్తమ్.